పందరిసాగుపై దృష్టి సారించాలి


Sat,November 16, 2019 11:54 PM

తూప్రాన్ రూరల్: మండలం పరిధిలోని ఇమాంపూర్‌లో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం పనులు చేపట్టాలని అధికార యంత్రగం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గ్రామంలో నిర్మాణం పనులు ప్రారంభించడానికి గానూ అధికారులతో కలిసి గ్రామ సర్పంచ్ గుర్రం ఎల్లం ముగ్గువేశారు. అనంతరం ఏర్పాటైన గ్రామసభలో ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహమీ పథకంలో ప్రజలకు ఉపయోగపడే 92 రకాల పనులున్నాయని, అయితే వాటిని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొర్రెలు, మేకలు, బర్రెల షెడ్‌లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. కూరగాయ పంటల సాగులో అధికదిగుబడి సాధించేందుకు పందిరిసాగు, డ్రిప్ట్‌ఇరిగేషన్ పద్ధతులు పాటించాలన్నారు. దీంతో పాటే గ్రామాల్లో హరితవనాల పెంపుకై ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ కన్సల్టెంట్ ఇంజనీర్ మాచర్ల, టెక్నికల్ అసిస్టెంట్ శ్రియ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...