వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు


Fri,November 15, 2019 11:43 PM

గజ్వేల్‌రూరల్ : వక్ఫ్‌బోర్డు భూములను ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎస్డీ మహ్మద్ ఖాసీం అన్నారు. హజరత్ ఎక్ షహీద్ దర్గాకు చెందిన వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమైన కేసుకు సంబంధించి శుక్రవారం వక్ఫ్‌బోర్డు ఓఎస్‌డీ ఖాసీం గజ్వేల్ పట్టణంలో విచారణ చేపట్టారు. దర్గా పరిధిలో 10సర్వే నెంబర్లలో 46.8ఎకరాల వక్ఫ్‌బోర్డు భూములు ఉన్నాయని, వీటిలో ఒక సర్వే నంబరులోని భూములు కబ్జాకు గురై కోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపారు.

ఈ మేరకు విచారణ చేపడుతున్నామన్నారు. భూములను సర్వే చేయడంతో పాటు గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలోని భూముల రికార్డులను ఓఎస్డీ ఖాసీం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు భూములు ఎవరు కబ్జా చేసినా, నిర్మాణాలు చేపట్టినా వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వక్ఫ్‌బోర్డు ఉమ్మడి జిల్లా ఇన్‌స్పెక్టర్ ఖాదర్, సర్వేయర్ సుజన్, రెవెన్యూ సర్వేయర్ నాగరాజు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...