డంపింగ్ యార్డులను పూర్తిచేయాలి


Fri,November 15, 2019 11:43 PM

టేక్మాల్: మండలంలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులను, వైకుంఠధామాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అడిషనల్ పీడీ ఉమాదేవీ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేయడంలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

గ్రామంలో ప్రజల నుంచి సేకరించిన చెత్త వేయడానికి డంపింగ్ యార్డులకు తరలించాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా ఏగ్రామంలోనైనా నిర్మాణం ప్రారంభించకపోతే వెంటనే పనులను చేపట్టాలన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ప్రతినెలా మొదటి వారంలో ఇందుకు సంబంధించిన బిల్లులను పూర్తిచేయాలని చెప్పారు. వచ్చే ఏడాది హరితహారంలో మొక్కలు నాటేందుకు, వాటి పెంపకానికి కావాల్సిన నర్సరీలను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు మొబైల్ యాప్‌లో స్వచ్ఛ్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సరోజ, ఎంపీపీ స్వప్న, తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో హిరణ్మయి, ఎంపీఈవో నర్సింహులు, ఏపీవో పౌలు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...