పరిసరాల పరిశుభ్రతను పాటించాలి


Fri,November 15, 2019 11:42 PM

రామాయంపేట: పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరూ పాటించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన అధికారి బోదకాల వ్యాధిగ్రస్తులకు కిట్‌లను అందజేశారు. అనంతరం సిబ్బందికి వ్యాధిగ్రస్తులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కీటకాల వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం రోజున ఆరోగ్య సిబ్బంది డ్రై డేగా పాటించాలన్నారు. బోదకాలు సోకిన వారు కచ్చితంగా ప్రభుత్వం అందజేసే మందులను తీసుకోవాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా బోదకాల వ్యాధి ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో దోమల, ఈగల వల్ల వ్యాధులకు గురయిన వారికి మందులు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వ దవాఖానకు విచ్చేసి మందులను తీసు కోవాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది కరిపె రవీందర్, పాకాల వెంకటేశ్వర్‌రావు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...