విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలి


Thu,November 14, 2019 11:57 PM

మెదక్ కలెక్టరేట్: ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సును కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో స్థిరపడేందుకు పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే చదువే కీలకమన్నారు. విద్యార్థి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అవగాహన లేకపోవడం వల్ల విద్యార్థులు మూస దోరణిలో విద్యాభ్యాసం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అనేక రకాలైన కెరీర్, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలన్నారు.

ప్రతి పాఠశాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని తప్పకుండా విద్యార్థులకు నేర్పించాలన్నారు. పదవ తరగతి లో విద్యార్థికి తగ్గ కోర్సులు వాటి ఉపాధి అవకాశాలను మనం వివరించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి మధుమోహన్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నర్సింహులు, నిర్మాణ్ సంస్థ బాధ్యులు సతీశ్, సెక్టోరియల్ అధికారులు నాగేశ్వర్‌నాయక్, సుభాశ్‌లతో పాటు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...