డిసెంబర్ 31లోపు పనులు పూర్తి చేయాలి


Thu,November 14, 2019 11:57 PM

మెదక్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో జరుగుతున్న పనులను డిసెంబర్ 31 వరకు పూర్తి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో నిర్మిస్తున్న కల్వర్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో జరుగుతున్న బీటీ రోడ్డు, సీసీ రోడ్డు, కల్వర్టు పనులు డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మెదక్ పట్టణంలో పనులు ప్రారంభమైనా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా త్వరగా జరుగలేకపోతున్నాయని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నారని గుర్తు చేశారు. అయితే అధికారుల అలసత్వం కారణంగా పనులు తొందరగా పూర్తి కావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కేంద్రంలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పట్టణంలోని గాంధీనగర్ నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వరకు బీటీ రోడ్డును డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డి ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...