ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి


Thu,November 14, 2019 11:56 PM

మెదక్ కలెక్టరేట్ : జిల్లా సమాఖ్యలలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లకు వచ్చే ఆసరా పెన్షన్లు, సదరం క్యాంపులో వచ్చిన ఫిర్యాదులను వెంటనే ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు వారిస్థాయిలో పరిష్కరించాలని ఆసరా పెన్షన్ పథకం రాష్ట్ర డైరెక్టర్ నవీన్‌కుమార్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, కంప్యూటర్ ఆపరేటర్‌లకు జిల్లా సమాఖ్య కాల్‌సెంటర్‌లకు వచ్చి ఆసరా, సదరం ఫిర్యాదులపై ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా సమాఖ్య కాల్‌సెంటర్‌కు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు ఏవిధంగా తీసుకోవాలి ఏవిధంగా పరిష్కరించాలని, అనే వాటిపై అధికారులకు ఆయన వివరించారు. సదరం క్యాంపు స్లాట్‌బుకింగ్ విధానం గురించి వివరించారు. స్లాట్‌బుకింగ్‌లో పార్ట్-ఏ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిర్ధారణ తేదీని దివ్యాంగులకు తెలిపి టోకెన్ ఇవ్వాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్డీఏ అడిషనల్ పీడీ భీమయ్య, మెదక్ ఏపీవో మెర్సినా, సంగారెడ్డి ఏపీవో సిద్దారెడ్డి, సిద్దిపేట ఏపీవో మధుసూదన్, రాష్ట్ర టీసీఎస్ టెక్నికల్ టీం సభ్యులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...