పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలి


Wed,November 13, 2019 11:53 PM

మెదక్ కలెక్టరేట్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినం 2019 సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో దివ్యాంగులు, దివ్యాంగుల సంరక్షణ, పునరావసం కల్పిస్తున్న సంస్థలకు పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి షేక్ రసూల్‌బీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినం పురస్కరించుకొని ఈ పురస్కారాలు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలు, సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 16వ తేదీ సాయంత్రం 5గంటలలోపు జిల్లా మహిళా శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...