ఉమ్మడి జిల్లా బాలబాలికలకు అథ్లెటిక్ పోటీలు


Wed,November 13, 2019 11:52 PM

మెదక్ అర్బన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అండర్ -14 బాలబాలికలకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15న, అండర్-17 బాలబాలికలకు ఈ నెల 16న జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కిషోర్‌కుమార్ బుధవారం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్స్‌తో ఉదయం 9 గంటలకు మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 18వ తేదీ నుంచి 20 వరకు కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. పూర్తి వివరాలకు పీఈటీలు రాజేందర్ 7013674089, మహిపాల్ 8309834226 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...