ప్రతి పల్లెలో నర్సరీలను సిద్ధం చేయండి


Wed,November 13, 2019 11:52 PM

మెదక్ కలెక్టరేట్ : వచ్చే సంవత్సరానికి ప్రతి గ్రామంలో నర్సరీలను సిద్ధం చేయాలని, ఆ దిశగా విత్తనాలను సేకరించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాలులో వివిధ మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటి నుంచే నర్సరీలలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు అవసరమున్న మొక్కలను నర్సరీలో పెంచాలన్నారు. ప్రతినెల మొదటి వారంలో హరితహారంలో నాటిన మొక్కల ఫొటోలను తీసి అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...