మహిళా సంఘాలకు శుభవార్త


Mon,November 11, 2019 11:55 PM

-వడ్డీ రాయితీ విడుదల చేసిన ప్రభుత్వం
-జిల్లాలో 12,052 సంఘాలకు రూ. 24.66 కోట్ల లబ్ధి
-హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు శుభవార్త చెప్పింది. బ్యాంకు లింకేజి రుణాల వడ్డీని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 12,052 వేల మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు 2017-18 సంవత్సరానికి గాను రూ. 24 కోట్ల 66 లక్షల రూపాయలు వడ్డీ రాయితీ రానున్నది. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాల వాయిదాలను నెలవారీగా మహిళా స్వయం సహాయక సంఘాలు సక్రమంగా చెల్లిస్తే వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11,788 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.22 కోట్ల 81లక్షల ,74వేల రూపాయలను ఇదివరకే ప్రభుత్వం మహిళా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఇప్పుడు తాజాగా 2017-18 సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రాయితీని విడుదల చేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 12,052 సంఘాలకు లబ్ధి
జిల్లాలో మొత్తం 12,654 స్వయం సహాయక సంఘాలు ఉండగా 2017-18 సంవత్సరంలో 12,052 స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజి రుణాలు తీసుకున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రుణాలు పొందిన మహిళా సంఘాలకు రాయితీ డబ్బులు అందివ్వనున్నది. రూ. 24 కోట్ల 66లక్షల రూపాయలు వడ్డీ రాయితీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అందజేయనున్న రాయితీ డబ్బులు త్వరలో మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నది. దీంతో మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2016-17 సంవత్సరానికి రూ.22కోట్ల 81 లక్షల 74వేలు ఖాతాల్లో జమ
2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఇదివరకే వడ్డీ రాయితీ డబ్బులను స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వ జమచేసింది. జిల్లాలో 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను 11,788 సంఘాలకు రూ. 22కోట్ల 81 లక్షల 74 వేల రూపాయలను స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాలో డబ్బులను ప్రభుత్వం జమచేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లిస్తే ఈ వడ్డీ మినహాయింపులో లబ్ధి పొందుతారు.

2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ. 24 కోట్ల 66 లక్షలు
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని 12,052 స్వయంసహాయక సంఘాలకు రూ.24 కోట్ల .66లక్షల రూపాయలు వడ్డీ రాయితీ విడుదల కానుంది. ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు రూ. 618 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ డబ్బులు విడుదల చేయడంతో జిల్లాకు రూ. 24 కోట్ల 66 లక్షల రూపాయలు విడుదల కానున్నాయి.

మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలి
మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితే కుటుంబమే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు అవుతుంది. మహిళలు గ్రామాల్లో బ్యాంకు రుణాలతో కిరాణం, బట్టల దుకాణాలు, చిరువ్యాపారాలు, టైలరింగ్, వంటి వాటిని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. తీసుకున్న రుణానికి ప్రభుత్వం వడ్డీమాఫీ చెల్లించడంతో మహిళలు మరింత ఉపాధి పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీరాయితీ విడుదల చేస్తుండటంతో స్వయం సహాయక సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అర్హత కలిగిన సంఘాల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ
జిల్లాలో వడ్డీలేని రుణ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న సంఘాలకు సంబంధించి వడ్డీనిధులను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో వీటిని ఆయా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు. జిల్లాలో 12,052 సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమచేయనుండటంతో పెద్ద ఊరట లభించింది. వడ్డీ డబ్బులతో ప్రస్తుతం చేస్తున్న స్వయం ఉపాధి పనులను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని స్వయం సహాయక సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. జిల్లాలో అధిక శాతం బ్యాంకు లింకేజి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుణ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.


108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles