యథావిధిగా తిరిగిన బస్సులు


Mon,November 11, 2019 11:50 PM

మెదక్ అర్బన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరుకున్నప్పటికీ జిల్లాలో మాత్రం బస్సులు యథావిధిగా తిరిగాయి. అధికారులు తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించడంతో అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వివిధ రూట్లలో బస్సులు నడువడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. దీంతో జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. మెదక్ డిపోలో ఆర్టీసీ సంస్థకు చెందిన బస్సులు 44, అద్దె బస్సులు 34 ప్రయాణికులకు సేవలను అందించాయి. మెదక్ బస్‌డిపో వద్ద పట్టణ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

కనిపించని సమ్మె...
బస్సులు యథావిధిగా తిరుగడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు నడిచాయి. సోమవారం మెదక్ డిపో నుంచి చేగుంట, తూప్రాన్ మీదుగా సికింద్రాబాద్ వరకు, కొల్చారం మీదుగా సంగారెడ్డి, పటాన్‌చెరువు వరకు, రామాయంపేట మీదుగా సిద్దిపేట, దుబ్బాక వరకు, మెదక్ నుంచి గోపాల్‌పేట, బాన్స్‌వాడ మీదుగా బోధన్ వరకు బస్సులు తిరిగాయి.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...