ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ


Mon,November 11, 2019 11:50 PM

మెదక్ మున్సిపాలిటీ : ప్రజల కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ నాగరాజు మాట్లాడుతూ చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే తిరిగి సంప్రదించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

-కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామానికి గొల్లకుర్మ ఎంబరి శేఖులు, మల్కే శ్రీశైలం, పసుల మల్లేశంలు తమను కులం నుంచి బహిష్కరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అదే గ్రామానికి చెందిన ఎంబరి మల్లమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది.
-తన కుమారుడు సంతోష్‌కు జగద్గీరీగుట్టకు చెందిన పెండెమ్ నర్సయ్య కూతురు లావణ్యతో వివాహం జరిగింది. కుటుంబంలో నెలకొన్న సమస్యల దృష్ట్యా కుమారుడి మామ పెండెమ్ నర్సయ్య, పెండెమ్ గంగమని, పెండెమ్ అనిల్‌లు తనతోపాటు తన భార్యను, కుమారుడిని వేధింపులకు గురిచేస్తున్నారు. వారంతా కలిసి తమను చంపాలని చూస్తున్నారని తూప్రాన్ పట్టణానికి చెందిన నందాల యాదగిరి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles