వివాహ వేడుకలకు


Mon,November 11, 2019 12:05 AM

-మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యే హాజరు
చిలిపిచెడ్: టీఆర్‌ఎస్ కౌడిపల్లి మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సార యాదమ్మ- రామాగౌడ్ కుమారుడు సార విజయ్‌కుమార్‌గౌడ్ వివాహం శిల్పతో ఆదివారం కౌడిపల్లి మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామ శివారులో ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ విహహ వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కౌడిపల్లి జెడ్పీటీసీ కవితఅంబర్‌సింగ్, కౌడిపల్లి ఎంపీపీ రాజునాయక్, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, చిలిపిచెడ్ ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తూప్రాన్ పట్టణంలో..
తూప్రాన్ రూరల్ : తూప్రాన్ పట్టణంలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు సలాక రాజేశ్వరశర్మ కూతురు వివాహానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్‌లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డిలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ పట్టణ, టీఆర్‌ఎస్ మండల నాయకులు శ్రీశైలంగౌడ్, బొంది రవీందర్‌గౌడ్, చంద్రారెడ్డి, బాబుల్‌రెడ్డి, వెంకటేశ్‌గుప్తా, సత్యనారాయణగౌడ్, కొడిప్యాక నారాయణగుప్తా, నందాల శ్రీనివాస్, సతీశ్‌చారిలతో పాటు పట్టణ, మండల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...