కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర


Mon,November 11, 2019 12:04 AM

నర్సాపూర్‌రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్మి నష్టపోవద్దని తెలిపారు. నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని తెలియజేశారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. త్వరలో గోదావరి నీటితో ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, సర్పంచ్ హేమలతమదన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు మల్లేశ్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...