ఏడుపాయలలో భక్తుల సందడి


Mon,November 11, 2019 12:04 AM

పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గా భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఏడుపాయలకు చేరుకుని మంజీరా నదిలో పుణ్యస్నానం చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు ఏర్పాటు చేయగా, వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, రాజశేఖర్‌శర్మ, రాముశర్మ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ ఆంజనేయులు తగిన చర్యలు చేపట్టారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...