ఆగని ఆర్టీసీ రథ చక్రం


Mon,November 11, 2019 12:04 AM

సంగారెడ్డి టౌన్ : మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ బస్సులు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌లో 626 బస్సులుండగా 517 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఉమ్మడి జిల్లాలో 357 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. శనివారం చలో హైదరాబాద్ నిర్వహించిన కార్మికులు ఆదివారం ఆయా డిపోల ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమ్మె ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా కొనసాగుతున్నది. తాత్కాలిక కార్మికుల ద్వారా బస్సులు యథావిధిగా సేవలందిస్తున్నాయి. ప్రయాణికులు యథేచ్ఛగా వారి గమ్య స్థానాలకు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో పుష్కలంగా బస్సులు తిప్పుతున్నారు.

మెదక్ రీజియన్‌లో తిరిగిన 517 బస్సులు
మెదక్ రీజియన్‌లో 626 బస్సులుండగా అందులో 517 బస్సులు ఆదివారం ప్రయాణికులకు సేవలందించాయి. 357 ఆర్టీసీ, 160 ప్రైవేట్ బస్సులు ప్రజలను వివిధ ప్రాంతాలకు తరలించాయి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ డిపోలో 55 బస్సులుండగా 27 ఆర్టీసీ, 7 ప్రైవేట్ బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. సంగారెడ్డి డిపోలో 108 బస్సులుండగా 69 ఆర్టీసీ, 26 ప్రైవేట్ బస్సులు, జహీరాబాద్ డిపోలో 90 బస్సులుండగా 48 ఆర్టీసీ, 23 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపోలో 68 బస్సులుండగా అందులో 46 ఆర్టీసీ, 20 ప్రైవేట్ బస్సులు, సిద్దిపేట డిపోలో 115 బస్సులుండగా 65 ఆర్టీసీ, 32 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. దుబ్బాక డిపోలో 40 బస్సులుండగా 19 ఆర్టీసీ, 4 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. హుస్నాబాద్ డిపోలో 54 బస్సులుండగా అందులో 37 ఆర్టీసీ, 12 ప్రైవేట్ బస్సులు తిరిగాయి. ఉమ్మడి జిల్లాలో ఆదివారం 517 బస్సులు ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేశాయి. అదే విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా వివిధ డిపోల పరిధిలోని కార్మికులు డిపోల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...