ఉచితంగా న్యాయ సాయం


Sat,November 9, 2019 11:45 PM

మెదక్, నమస్తే తెలంగాణ : నిరుపేద ప్రజలు ఉచితంగా న్యాయ సాయం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి నారాయణ పేర్కొన్నారు. శనివారం జాతీయ న్యాయసేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా న్యాయాన్ని పొందలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించాలనే భావనతో జాతీయ లీగల్ సర్వీసెస్ దినోత్సవాన్ని ప్రారంభించిందన్నారు. 1995 నవంబర్ 9న సుప్రీం కోర్టులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన 22 మందికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభరాణి, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...