కానిస్టేబుల్ కవితకు ఘన సన్మానం


Fri,November 8, 2019 12:23 AM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: పోలీసు అమరవీరుల దినం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కవితకు రాష్ట్ర స్థాయిలో రెండో బహుమతి రావడం అభినందనీయమని నర్సాపూర్ సీఐ నాగయ్య, ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ కవితకు సీఐ నాగయ్య, ఎస్‌ఐ సత్యనారాయణలు మిఠాయిలు తినిపించి పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సీఐ నాగయ్య మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కవిత అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినం సందర్భంగా పోలీసు వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పులు అనే అంశంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలలో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. కవిత జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి నగదుతో పాటు ప్రశాంసాపత్రం సాధించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...