డాటా ఎంట్రీపై అవగాహన


Fri,November 8, 2019 12:23 AM

తూప్రాన్ రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్‌లలో జరిగే రోజూవారి కార్యక్రమాలు హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం(హెచ్‌ఎంఐఎస్)లోపొందుపరుచాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి(డీఐవో) డా క్టర్ సుమిత్ర అన్నారు. తూప్రాన్ ఐకేపీ కార్యాలయంలో గురువారం తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగ్ మండలాలకు చెందిన డాక్టర్‌లు, సీహెచ్‌వోలు, సూపర్‌వైజర్‌లతో డాటా ఎంట్రీపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ దవాఖానాల్లో అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడూ డాటా ఎంట్రీలో నమోదు చేయించాలని, గర్భవతుల పేర్లను తొందరగా నమోదు చేయడం, వారికి అందించే వైద్య సేవలు, ప్రసూతి సమయాల్లో ప్రభుత్వ దవాఖానలకు రెఫర్ చేయడం, చిన్న పిల్లలకు ఇచ్చే వాక్సిన్, కేసీఆర్ కిట్‌ల పంపిణీ తదితర అంశాలపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్‌లలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రోజూవారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడూ హెచ్‌ఎంఐఎస్ సిస్టంలో నమోదు చేయాలన్నారు.

రక్తహీనత నుంచి కాపాడటం కోసం గానూ 6 నెలల నుంచి 19 సంవత్సరాల్లోపు యువకులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. దీంతో పాటే చిన్నారులకు ఇచ్చే వాక్సిన్ వివరాలు డాటా ఎంట్రీలో నమోదు చేయాలన్నారు. కేసీఆర్ కిట్‌ల పంపిణీ వివరాలు, పెండింగ్‌లో ఉన్న వివరాలు డాటా ఎంట్రీ ఆపరేటర్‌లతో నమో దు చేయించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డెమో అధికారి పాండురంగాచారి, తూప్రాన్ డివిజన్ పరిధిలోని డాక్టర్లు ఆనంద్, బాపురెడ్డి, వినయ్‌కుమార్, రాకేశ్, సీహెచ్‌వోలు సాలూబాయ్, బాలనర్సయ్య, కిషన్, సూపర్‌వైజర్‌లు రాములమ్మ, సంపతి, శ్రీనివాస్, ప్రదీప్‌కుమార్, రాజిరెడ్డి, వైద్యసిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్‌లు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...