నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి


Fri,November 8, 2019 12:23 AM

తూప్రాన్ రూరల్ : తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అధికారులకు సూచించారు. తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం సాయంత్రం పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తూప్రాన్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్, రావెళ్లి, బ్రాహ్మణపల్లిలో కొనసాగుతున్న పనుల పురోగతిపై ఆయా శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూప్రాన్‌లో కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం, అల్లాపూర్ శివారులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. తూప్రాన్ మున్సిపాలిటీలో కొత్తగా రూ.కోటి 73 లక్షలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గడ, ఎస్‌డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పనుల నిర్మాణంలో జాప్యం వహించరాదని, అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామారావు, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ ఖాజామోజియొద్దీన్, పీఆర్ డీఈ నర్సింహులు, ఏఈలు ప్రసాద్, సన, విజయ్‌ప్రకాశ్, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...