30 రోజుల ప్రణాళికతో పల్లెలన్నీ పరిశుభ్రం


Fri,November 8, 2019 12:22 AM

పెద్దశఃకరంపేట : ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టడంతో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. గురువారం పెద్దశంకరంపేట ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోయకూడదన్నారు. జిల్లాను ఇతర జిల్లాలతో పోల్చుకుంటే జ్వరాలు తక్కువగానే ఉన్నాయన్నారు. జిల్లాలో 9 దవాఖానలు, 24 గంటలు పని చేస్తున్నాయన్నారు. దవాఖనలో రోగులకు నిరంతరంగా వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖనలో ప్రసవాలు పెరిగేలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీహెచ్‌సీ సిబ్బంది మరింత అవగాహన కల్పించాలన్నారు. పెద్దశంకరంపేటలో కుటుంబ నియంత్రణ క్యాంపు ఎందుకు నిర్వహించడం లేదని విలేకరులు అడుగగా వాటికి సంబంధించిన నిధులు మంజూరు కాలేదన్నారు. జిల్లా కేంద్రమైన మెదక్, నర్సాపూర్, తైప్రాన్ ప్రభుత్వ వైద్యశాలల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పీహెచ్‌సీ సిబ్బంది మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు పుష్పలత, శ్వేత, పీహెచ్‌సీ సిబ్బంది విజయభాస్కర్, రామ్మోహన్, శివప్రసాద్, కంఠివైద్య నిపుణులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...