ఇంకుడు గుంతలు, ఊటచెర్వులను నిర్మించాలి


Fri,November 8, 2019 12:22 AM

రామాయంపేట : గ్రామాల్లో నీటి గుంటలు, ఊట చెరువులు, ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలను పెంచాలని జిల్లా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి పేర్కొన్నారు. గురువారం రామాయంపేట మండలం కాట్రియాల గ్రామస్తులకు, ఉపాధి హామీ సిబ్బందికి అవగాహన కల్పించారు. నీటివనరులు పెరిగితేనే మనకు నీటి కొరత ఉండదన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను కచ్చితంగా నిర్మించుకోవాలన్నారు. ఇంకుడు గుంతలతో ఎన్నో లాభాలుంటాయన్నారు. బోరు బావుల వద్ద కూడా బోర్‌వెల్ రీచార్జి గుంతలను తవ్వుకోవాలన్నారు.

గ్రామంలోని మురికికాల్వలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామంలోకి పందులు రాకుండా చేయాలన్నారు. పందుల మూలంగానే డెంగీ, డయేరియా, మలేరియా తదితర భయంకరమైన వ్యాధులు వస్తాయన్నారు. గ్రామస్తులు తమ ఇండ్లలోని పాత వస్తువులు ఏమైనా ఉంటే వాటిని బయటి ప్రాంతాలకు పారవేయాలన్నారు. పాత వస్తువులతో మనుషులు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఏపీవో శంకరయ్య, గ్రామ సర్పంచ్ మైలారం శ్యాములు, కార్యదర్శి రాములు, ఎఫ్‌వో శ్రీశైలం, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...