హరిత తెలంగాణను నిర్మిద్దాం


Thu,November 7, 2019 02:26 AM

-కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
-పెంపునకు సీఎం పక్కా చర్యలు
-రాష్ట్రంలో జనరంజక పాలన
-గజ్వేల్‌ను దేశంలోనే ఆదర్శంగా నిలుపుదాం
- బాధ్యతల స్వీకరణలో అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, నమస్తే తెలంగాణ : స్వచ్ఛమైన వాతావర ణం.. ఆరోగ్యకరమైన జీవన విధానంపైనే భవిష్యత్తు.. సీఎం కేసీఆర్, దీర్ఘకాలిక ప్రజా అవసరాల అనుగుణంగా రాష్ర్టాన్ని ప్రణాళిక బద్ధంగా ప్రగతి పథంలో ముందు కు తీసుకువెళ్తున్నారు... హరిత తెలంగాణ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ప్రతాప్‌రెడ్డి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బంజారా ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో గొప్ప బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్‌ను రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆదర్శంగా నిలపడానికి సీఎం కృషి చేస్తున్నారని.. ఇదంతా గజ్వేల్ ని యోజక వర్గ ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. హరిత తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో అడవుల విస్తరణతోపాటు పచ్చదనం

- పరిశుభ్రతపై ప్రభుత్వం చేపట్టిన పనులు విజయవంతమై సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇటీవల మంత్రులు, కలెక్టర్లను గజ్వేల్ పర్యటనలో ఇక్కడ జరిగిన అటవీ సంరక్షణ పనులను సీఎం కేసీఆర్ వారికి చూపించారని గుర్తు చేశారు. గజ్వేల్ జరిగిన అటవీ విస్తరణను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో చేపట్టి హరిత తెలంగాణగా మార్చుతామని అన్నారు. సీఎం కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నారని.. తాను ఇందులో భాగస్వామిని అవుతానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, కార్పొరేషన్ చైర్మన్లు బాలమల్లు, పన్యాల భూపతిరెడ్డిలతోపాటు సునీతాలకా్ష్మరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన ప్రతాప్‌రెడ్డి
ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రగతి భవన్‌కి వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అడవుల ప్రాముఖ్యత వాటి అభివృద్ధి, విస్తరణపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అలాగే, ప్రతాప్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి మంత్రి హరీశ్‌రావు హాజరై అభినందించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...