అంకితభావంతో పని చేయండి


Thu,November 7, 2019 02:23 AM

పెద్దశంకరంపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గానికి అత్యధికంగా 250 మంది నూతన టీచర్ల నియామకం జరిగిందని, నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో పీఆర్టీయూ సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ 500 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన ఉందన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...