ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత రెవెన్యూ అధికారులదే


Thu,November 7, 2019 02:23 AM

చేగుంట : ప్రభుత్వ భూములకు సంబంధించి పరిరక్షించే బాధ్యత రెవెన్యూ అధికారులదే అని అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేగుంటలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో జేసీ నగేశ్‌తో పాటు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లోని పలు సమస్యలను సభ దృష్ఠికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రమైన చేగుంటలో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిలో అక్రమంగా పరిశ్రమలు నిర్మాణం చేపట్టారని వాటిని పరిరక్షించే బాధ్యత రైవెన్యూ అధికారులపైన ఉందన్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చేగుంట, నార్సింగి, రామాయంపేట, తూప్రాన్, మనోహరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములకు ధరలు అధికంగా ఉండటంతో రియల్ వ్యాపారులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మరోసారి రెవెన్యూ గ్రామ సభను ఏర్పాటు చేయాలని జేసీ నగేశ్‌కు తెలిపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...