పీఆర్టీయూ మండల మాస సంచిక విడుదల


Thu,November 7, 2019 02:23 AM

పెద్దశంకరంపేట మండల పీఆర్టీయూ మాస సంచికను ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విడుదల చేశారు. అనంతరం నూతనంగా పేట మండలానికి వచ్చిన 27 మంది ఉపాధ్యాయులకు ఐడీ కార్డులను అందజేశారు. రాఘవానితండా పాఠశాల 161వ జాతీయ రహదారి విస్తరణలో పోతున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉందని పీఆర్టీయూ నాయకులు తెలుపగా మిషన్ భగీరథ కనెక్షన్లు ఇప్పించి, సంపులు నిర్మించేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ విజయరామరాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆసూరి మురళీపంతులు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రామచంద్రాచారి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కేవీ రవిందర్, పోమ్యానాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఎంఈవో పోచయ్య, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, ఎంపీటీసీలు సుభాశ్‌గౌడ్, సురేశ్‌గౌడ్, దామోదర్, రాజేశ్, సర్పంచులు నరేశ్, సుధాకర్, పీఆర్టీయూ నాయకులు రఘునాథ్‌రావు, ప్రసన్న, సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...