రైతులందరికీ అందుబాటులో ఉండాలి


Thu,November 7, 2019 02:22 AM

మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి ఏఈవో రైతులందరికీ అందుబాటులో ఉండాలని కలెక్టర్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏఈవో వద్ద తన పరిధిలోని గ్రామాలకు సంబంధించిన మ్యాపులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మ్యాపులు అందుబాటులో ఉన్నప్పుడే సర్వేలో ఖచ్చితమైన సమాచారం లభిస్తుందన్నారు. ఏఈవోలు తమ పరిధి గ్రామాల రైతులందరకీ అవసరమైన సలహాలు, సూచనలు అందించి వారికి తోడుగా ఉండేందుకోసమే ప్రభుత్వం ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక విస్తరణ అధికారిని నియమించినట్లు తెలిపారు.

ప్రతి సీజన్‌లో ఏ ఏ గ్రామాల్లో ఎంత విస్తీర్ణంలో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారనే విషయం నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రతి ఏఈవో తమ పరిధిలోని గ్రామాలకు సంబంధించి నక్షాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి మండల సర్వేయర్ వద్ద ప్రతి గ్రామానికి సంబంధించిన మ్యాపులు అందుబాటులో ఉంటాయని స్థానిక మండల వ్యవసాయ అధికారి వీటిని సేకరించి ఏఈవోలకు అందజేయాలన్నారు. ఒక రెండు సంవత్సరాలు ఈ పద్ధతిలో సర్వే చేస్తే గ్రామంలోని ప్రతి సర్వే నంబర్‌పై పూర్తిస్థాయి అవగాహన వస్తుందన్నారు. గతంలో ఏదో మొక్కుబడిగా అంచనాలు వేశారని కానీ ఇప్పుడు ఖచ్చితమైన సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. సాగు విస్తీర్ణం నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో పంటపొలాలను సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఏవో పరశురాం నాయక్, జిల్లాలలో ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...