వరి ధాన్యానికి గిట్టుబాటు ధర


Thu,November 7, 2019 02:22 AM

చేగుంట : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని ఎమ్మెల్యే రామలింగారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం చేగుంటలో సహకార సంఘం చైర్మన్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ చిట్టబోయిన వెంకటేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాన్ని జేసీ నగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో పాటు మక్కరాజిపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించగా, ఇబ్రహీంపూర్‌లో సొసైటీ చైర్మన్ అంజగౌడ్ ఆధ్వర్యంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్‌లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రేడ్‌కు రూ.1835, బీ గ్రేడ్‌కు రూ.1815 చొప్పున ప్రభుత్వం గిట్టుబాటు ధరను చెలుస్తుందని పేర్కొన్నారు.

245 కోనుగోలు కేంద్రాల ఏర్పాటు : జేసీ
జిల్లావ్యాప్తంగా 245 వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐకేపీ ఆధ్వర్యంలో 24 సెంటర్లను ఇప్పటి వరకు ప్రారంభించుకున్నామని జేసీ నగేశ్ తెలిపారు. తేమను పరిశీలించే మిషిన్లు, సంచుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ చేగుంట, నార్సింగి మండలాల అధ్యక్షులు తాడెం వెంగళ్‌రావు, తౌర్యనాయక్, వైస్ చైర్మన్ పోచయ్య, సొసైటీ డైరెక్టర్లు అయిత రఘురాములు, వెంకట్‌గౌడ్, మోహన్, సీవోలు మాణిక్యం, సంతోశ్‌కుమార్, సర్పంచులు రాములు, స్వర్ణలత, అశోక్, కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, బండి కవిత తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...