కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి


Thu,November 7, 2019 02:22 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం నర్సాపూర్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. దళారుల మాయమాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పీఏసీఎస్ చైర్మన్ శారద, టీఆర్‌ఎస్ నాయకులు రమణారావు, చంద్రశేఖర్, భిక్షపతి, నాగేశ్, కృపాచారి, రాఖేశ్‌గౌడ్, ముజాయత్, రైతు సుభాష్‌చంద్రబోస్, పీఏసీఎస్ సిబ్బంది మల్లేశ్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...