నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి


Wed,November 6, 2019 01:23 AM

మెదక్‌ కలెక్టరేట్‌ : జిల్లాలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరులలో నీటి లభ్యత ఆధారంగా యాసంగి సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ వానకాలం సీజన్‌లో జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. కావునా జిల్లాలోని చెరువులు, కుంటలలో ఉన్న నీటి వనరుల లభ్యతను బట్టి యాసంగి సీజన్‌లో రైతులు పంటలు సాగు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు సైతం నీటి లభ్యత సాగు పై రైతులకు సూచనలు చేయాలన్నారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉన్నదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

సుమారు 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉన్నదని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. యాసంగి సీజన్‌లో వర్షాలను నమ్మికాకుండా నీటి లభ్యత ఆధారంగా వివిధ పంటలు రైతులు సాగుచేసేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. వానకాలం సీజన్‌లో ఒక మోస్తరు వానలు కురవడం వల్ల సాగుచేసిన పంటలు చేతికి వచ్చాయన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. రాయిన్‌పల్లి చెర్వు, కింద సుమారు 2550 ఎకరాల విస్తీర్ణంలో తైబందీ కింద నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఈఈ ఏసయ్య తెలిపారు. ఈ మేరకు ఏ ఏ చెరువుల కింద ఎంత విస్తీర్ణంలో పంటలు చేయాలో రైతులకు సూచించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్‌, తూప్రాన్‌ ఆర్డీవోలు సాయిరాం, శ్యామ్‌ ప్రకాశ్‌, డీఏవో పరశురాం నాయక్‌, సీపీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...