మినీ స్మార్ట్‌సిటీకి ముందడుగు


Wed,November 6, 2019 01:23 AM

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : మినీ స్మార్ట్‌సిటీగా మారడానికి గజ్వేల్‌ పట్టణంలో మరో ముందడుగు పడింది. పట్టణంలో పారిశుద్ధ్యం, పచ్చదనంతోపాటు ఇత ర అంశాల్లో రాష్ర్టానికే ఆదర్శంగా నిలువడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళిక రూపకల్పన చేశారు. ప్రణాళికలో భాగంగా అండర్‌ డ్రైనేజ్‌ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.99 కోట్లు మంజూరు అయ్యాయి. గతంలో గజ్వేల్‌కు వచ్చినప్పుడు పట్టణాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాలని అధికారులకు సూచించారు. వెంటనే పట్టణంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాధనలు సిద్ధ్దం చేసి ప్రభు త్వానికి అందజేశారు. రూ.100 కోట్లు అవసరమని అంచ నా వేయగా సీఎం వెంటనే పాలన పరమైన అనుమతులు మంజూరు చేశారు. తుది ప్రణాళిక రూపొందించిన మున్సిపాలిటీ అధికారులు.. నిధుల మంజూరు కోసం సీఎం దృష్టికి మంత్రి హరీశ్‌రావు ద్వారా తీసుకువెళ్లగా వెంటనే నిధులను విడుదల చేస్తు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో గజ్వేల్‌ మున్సిపల్‌ పరిధిలో అన్ని వీధులు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది.

పరిశుభ్రతకు పట్టణం కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. నిధుల విడుదల పై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌ పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా మారుస్తున్నామని ఆ దిశగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణం చేపట్టనున్నట్లు అందుకు రూ. 99 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారి దినదినాభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ఎన్నడూ లేనంతంగా ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి వైపు అడుగులేస్తుందని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, రోడ్ల అభివృద్ధి, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పచ్చధనం పెంపొందించడంలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.కాగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, ఇందుకు సహకరించిన మంత్రి హరీశ్‌రావుకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...