రేపు వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం


Mon,November 4, 2019 11:42 PM

తూప్రాన్ రూరల్ : నగరంలోని మాసబ్‌ట్యాంకు సమీపంలో బంజార ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 6న బుధవారం రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఉంటుందని టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బస్వన్నగారి సత్యనారాయణగౌడ్ అన్నారు. తూప్రాన్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారన్నారు.

ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బొంది రవీందర్‌గౌడ్, కృష్ణారెడ్డి, పసుల నారాయణ, అల్లాడి ఎల్లయ్య, ఆంజనేయులు, పసుల తిరుపతి పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...