జాతీయస్థాయి కరాటే పోటీల్లో..ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు


Mon,November 4, 2019 11:42 PM

తూప్రాన్ రూరల్ : జాతీయస్థాయి కరాటే పోటీల్లో తూప్రాన్ గురుకుల పాఠశాలకు చెందిన బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడళ్లను సాధించారు. నగరంలోని రుద్రమాదేవి, చోటోఖాన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెల్ఫ్‌డిపెన్స్ షీ టీం కోచ్‌లు ఎన్.లక్ష్మి, వి.రవిల ఆధ్వర్యంలో సోమవారం విక్టోరియా ప్లే గ్రౌండ్ ఇండోరియా స్టేడియంలో నిర్వహించిన కరాటే టోర్నమెంట్‌లో వివిధ రాష్ర్టాలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. అయితే ఈ టోర్నమెంట్‌లో తూప్రాన్, రామాయంపేట గురుకుల పాఠశాలలకు చెందిన బాలికలు, వెంకటాయపల్లికి చెందిన నక్కలపల్లి సంగీత, తూప్రాన్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన విద్యార్థి అజయ్ ఆధిత్యలు అత్యంత నైపుణ్యం ప్రదర్శించడంతో జాతీయస్థాయిలో జరిగిన టోర్నమెంట్‌లో ట్రోఫీని కైవసం చేసుకుని బంగారు పతకాలు సాధించారు.

తూప్రాన్ పట్టణానికి చెందిన కరాటే కోచ్ భిక్షపతి తూప్రాన్, రామాయంపేట గురుకుల పాఠశాలలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఉచితంగా కరాటేలో కొంతకాలంగా శిక్షణ ఇచ్చాడు. మహిళలు, బాలికలు తమ ఆత్మరక్షణ కోసం గానూ ఈ కరాటేలో కొంతకాలంగా శిక్షణ ఇచ్చి, తర్పీదులు నేర్పించగా, సోమవారం నగరంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొంది బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పీఈటీలు అరుణోదయ, విజయ, ఉపాధ్యాయులు బంగారు పతకాలు సాధించిన బాలికలను అభినందించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...