బాధితులకు సత్వరమే న్యాయం చేయాలి


Mon,November 4, 2019 11:41 PM

మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని చట్టపరిధిలో పరిష్కరించాలని సంబంధింత పోలీస్ అధికారులను ఆదేశారు. బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తన స్నేహితుడు మృతిచెందాడని, తనకు తీవ్ర గాయాలయ్యాయని, అయితే తానే అతడిని చంపినట్లు మృతుడి తండ్రి తనను మనోవేదనకు గురిచేస్తున్నాడని, ప్రజావాణిలో జిల్లా అదనపు ఎస్పీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. హవేళీఘనపూర్ మండలం కొచ్చెరువు తండాకి చెందిన ముడావత్ భాస్కర్, తన స్నేహితుడు ముడావత్ నరేశ్‌లు ముడావత్ రెడ్డ్యా వద్ద మిషన్ భగీరథ పనులు చేస్తున్నారు.

రోజుమాదిరిగానే ఈ యేడాది మార్చి 13వ తేదీన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా తనకు తీవ్రగాయాలు అయినట్లు చెప్పాడు. అయితే తానే నరేశ్‌ను చంపినట్లుగా అతని తండ్రి నిత్యం తనను గొడవకు దిగుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన అదనపు ఎస్పీ బాధితుడికి చట్టప్రకారం న్యాయం చేయాలని మెదక్ రూరల్ సీఐకి ఆదేశించారు.అలాగే కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామానికి చెందిన చాకలి సాయిబాబా తన భార్య లక్ష్మి జూలై 13న రాఖీ పౌర్ణమికి తల్లిగారి ఇంటికి వెళ్లిందని తెలిపారు. తిరిగి రాకపోవడంతో మూడు సార్లు వెళ్లినప్పటికీ కాపురానికి రావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ విషయంలో బాధితుడికి చట్టపరిధిలో న్యాయం చేయాలని సంబంధిత సీఐకి సూచించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...