ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి గదులు


Mon,November 4, 2019 11:41 PM

వెల్దుర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి గదులను నిర్మిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ దవాఖాన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నార్సింగి, పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రేగోడ్, రెడ్డిపల్లి, వెల్దుర్తి దవాఖానల్లో ప్రసూతి గదులను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో పెద్దశంకరంపేట, రెడ్డిపల్లిలో గదుల నిర్మాణం పూర్తి అయిందని, మిగతా కేంద్రాల్లో త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ దవాఖానల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడుతల్లో రూ. 1.75 లక్షల నిధులను మంజూరు చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 ఏఎన్‌ఎం పోస్టులు, 40 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే వ్యాధుల సీజనల్ వ్యాధుల వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వైద్యాధికారి వెంట డీడీవో నవీన్, ఎంపీహెచ్‌వో ప్రదీప్, ఏఎన్‌ఎం పద్మ, సిబ్బంది ఉన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...