మనపల్లె బడి -మన ధర్మనిధికి చెక్కుల అందజేత


Mon,November 4, 2019 11:41 PM

మెదక్ కలెక్టరేట్: కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనపల్లె బడి-మన ధర్మనిధి కార్యక్రమానికి గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు రూ. లక్ష చొప్పున, జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బంది రూ.40వేల రూపాయల చెక్కులను మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ ధర్మారెడ్డికి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాల మెరుగుకోసం కలెక్టర్ ధర్మారెడ్డి చేపట్టిన పథకం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, జేసీ నగేశ్ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...