ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాలి


Mon,November 4, 2019 11:41 PM

మెదక్, నమస్తే తెలంగాణ : ఒక మండల పరిధిలోని గ్రామాలు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి హరీశ్‌రావు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో మండలాల వారీగా పోలీసు స్టేషన్లు ఉన్నాయని, జిల్లాల పునర్విభజనలో భాగంగా కొన్ని మండలాల పరిధిలోని గ్రామాలు ఇతర మండలాల పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నట్లు నా దృష్టికి రావడం జరిగిందన్నారు. ఇలాంటి గ్రామాలను గుర్తించి ఆయా మండల పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా మెదక్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలైన ఔరంగబాద్, ఆవుసులపల్లి, పిల్లికొట్యాల గ్రామాలను మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సైతం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వీటితో టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామం పాపన్నపేట పోలీస్‌స్టేషన్ ఉందన్నారు. వీటన్నింటిని ఆయా మండల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లకు మార్చేందుకు డీఐజీ ద్వారా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని ఇన్‌చార్జి ఎస్పీ చంద్రశేకర్‌రెడ్డి మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ ధర్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ హేమలత, ఏఎస్పీ నాగరాజు, మెదక్, తూఫ్రాన్, నర్సాపూర్ ఆర్డీవోలు సాయిరాం, శ్యామ్ ప్రకాశ్, అరుణారెడ్డి, డీఎస్పీలు కృష్ణమూర్తి, కిరణ్‌కుమార్‌లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...