రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నర్స్‌గా మెదక్ విద్యార్థులు


Sun,November 3, 2019 11:32 PM

మెదక్, నమస్తే తెలంగాణ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాలుర అండర్-17 షెటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మెదక్ విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారని జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కిశోర్‌కుమార్, కోచ్ సత్యారావులు ఆదివారం విలేకరులకు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని జిల్లా క్లబ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్టస్థాయి పోటీలకు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీల్లో హైదరాబాద్‌తో తలపడి ఓటమి చెంది రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం ట్రోఫీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందజేసినట్లు తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...