యాదవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి


Sun,November 3, 2019 11:32 PM

మనోహరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన సదర్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. సబ్సిడీపై గొర్రెల పంపిణీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్నది. అదేవిధంగా నగరానికే పరిమితమైన సదర్ ఉత్సవాలు నేడు ప్రతి పల్లెలో జరుగడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ మహేశ్‌గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రమణాగౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదవరెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ రమణ, యాదవసంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...