ఏడుపాయలలో భక్తుల సందడి


Sun,November 3, 2019 11:32 PM

పాపన్నపేట :పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఏడుపాయలకు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులను ఇబ్బందులు రాకుండా ఏడుపాయల ఈవో మోహన్‌రెడ్డి ఆలయ సిబ్బంది రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ శర్మ తదితరులు ఏర్పాటు చేయగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా వుండగా వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, రాజశేఖర్‌శర్మ తదితరులు అమ్మవారి సేవలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ ఆంజనేయులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...