రేపు మెదక్‌కు.. మంత్రి హరీశ్ రావు రాక


Sat,November 2, 2019 11:58 PM

-జెడ్పీ మొదటి సమావేశంలో మంత్రి హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయం జిల్లాలో అమలు
-దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు
-సోమవారం మంత్రి హరీశ్‌రావుతో పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ పాల్గొనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- సహకార సంఘం భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి
-కలెక్టరేట్‌లో పల్లెప్రగతి పనులపై పంచాయతీరాజ్, విద్యుత్, వ్యవసాయ, సివిల్ సైప్లెయ్ అధికారులతో సమీక్ష
-మెదక్ మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రవేశపేట్టిన పల్లెప్రగతి పనులు జిల్లాలో అద్భుత ఫలితాలనిచ్చాయి. వాటిని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్‌ను ఇప్పించే విధంగా మొదటి జిల్లా పరిషత్ సమావేశంలోనే కలెక్టర్ ధర్మారెడ్డితో చర్చించి అమలుకు శ్రీకారం చుట్టారు. సోమవారం 50 ట్రాక్టర్లను 50 గ్రామ పంచాయతీలకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. మిగతా గ్రామ పంచాయతీలకు దశల వారీగా అదే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం 10: 00 గంటలకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డితో కలిసి నూతనంగా నిర్మంచిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 10.30 గంటలకు మెదక్‌లో మూడు వరుసల రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం11.00 గంటలకు ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు.

అనంతరం 12.00 గంటలకు 30 రోజుల పల్లెప్రగతి కార్యక్రమం అమలుపై పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫర శాఖ సంబంధిత అధికారులు వానకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించిన ధ్యానం కొనుగోలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులతో అయా మున్సిపాలిటీలో చేపట్టిన ప్రగతి పనులపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. 3.15 నిమిషాలకు బ్యాంకర్లతో నిర్వహించే సమీక్ష సమవేశంలో పాల్గొంటారు. 4.00 గంటలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...