మల్కాపూర్‌లో నీటిపారుదలశాఖ ఇంజినీర్ల బృందం పర్యటన


Sat,November 2, 2019 11:54 PM

తూప్రాన్ రూరల్: మెదక్ జిల్లా నీటిపారుదలశాఖ ఈఈ యేసయ్య ఆధ్వర్యంలో జిల్లాలోని డివిజన్, మండలస్థాయి ఇంజినీర్‌ల బృందం శనివారం తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో పర్యటించింది. గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, రాక్‌గార్డెన్, రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కల పెంపకం, ఇంటింటికీ నిర్మించుకున్న ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన గ్రామాభివృద్ధి చెందడానికి కారణాలు వారు అడిగి తెలుసుకోగా గ్రామస్తులు, స్వచ్ఛభారత్ యువకులు సమిష్టిగా కృషి చేయడంతోనే గ్రామాభివృద్ధి జరిగిందని గ్రామస్తులు వారికి వివరించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...