నేడు పెరిక కుల వధూవరుల వివాహ పరిచయ వేదిక


Sat,November 2, 2019 11:53 PM

మెదక్, నమస్తే తెలంగాణ : ప్రపంచ పెరిక కుల వధూవరుల 19వ వివాహ ఉచిత పరిచయ వేదిక ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 1:30గం.లకు జరుగనున్నది. ఈ మేరకు పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘం లిమిటెడ్ కన్వీనర్ సుంకరి ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై తగిన భాగస్వామిని ఎంచుకోవాలని కోరారు. వధూవరుల పూర్తి వివరాలను 9963013666కు వాట్సాప్ చేయాలని ఆయన తెలిపారు. వధూవరులను కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావాలని, పెరిక కుల యువతీ, యువకులకు ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు ఫుల్, హాఫ్ సైజు పోస్టు కార్డు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. మ్యారేజీ బ్రోకర్లకు పరిచయ వేదికలోకి అనుమతి లేదని ఆయన తెలిపారు. 2010లో ఏప్రిల్ 10న ప్రారంభమైన వేదిక ఇప్పటి వరకు 18 కార్యక్రమాలు నిర్వహించి 24 వందల పెండ్లిళ్లు కుదిర్చినట్టు ప్రకటించారు. మరింత సమాచారం కోసం 9989343932కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...