రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ జట్టుకు విద్యార్థి ఎంపిక


Sat,November 2, 2019 11:53 PM

మెదక్ మున్సిపాలిటీ : రాష్ట్రస్థాయి అండర్ -17 బాల బాలికల సాఫ్ట్‌బాల్ జట్టుకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మెదక్ టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ(బాలికల) పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్న కె.నవీన ఎంపికైందని ప్రిన్సిపాల్ హిమబిందు, పీడీ సుజాతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున 3న ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నవీనను వారు అభినందించారు. నవీన ఈ పోటీలో విజయాన్ని సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలని పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయులు కోరారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...