చందాయిపేటలో హైదరాబాద్ విద్యార్థులు


Sat,November 2, 2019 11:53 PM

చేగుంట: హైదరాబాద్ మియాపూర్ కెనరి ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామాన్ని శనివారం సందర్శించారు. గ్రామ పంచాయతీ విధి విధానాలు, వాటి నిర్వహణ వంటి పలు అంశాలను గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం చేపట్టే పలు అంశాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి, పురాతన బురుజును గ్రామ ఊర చెరువును సందర్శించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోశ్‌కుమార్, వార్డు సభ్యులు లావణ్య, రమ్య, పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్, ఉపాధ్యాయులు గిరీశ్, సంజీవ్, గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...