యథావిధిగా ప్రత్యామ్నాయ రవాణా


Sat,November 2, 2019 11:52 PM

మెదక్ అర్బన్: ఆర్టీసీ కార్మికులు 29 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నపట్టికీ మెదక్ డిపో బస్సులు మాత్రం యథావిధిగా వివిధ రూట్లలో తిరుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు, డీటీవో, పోలీస్ అధికారుల సమన్వయంతో జిల్లాలో బస్సులు వివిధ రూట్లలో 90 శాతానికి పైగా బస్సులు తిరుగుతున్నాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడ కన్పించడంలేదు. ఆర్టీసీ అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించడంతో జిల్లాలో ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. శనివారం మెదక్ డిపోలో ఆర్టీసీ సంస్థకు చెందిన 62 ఉండగా 51 బస్సులు, అద్దెబస్సులు 36 ఉండగా 36 బస్సులు వివిధ రూట్లలో యథావిధిగా ప్రయాణికులకు సేవలను అందించాయి. దీంతో మెదక్ జిల్లాలో ఎక్కడ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం కన్పించడంలేదు. మెదక్ డిపో నుంచి మెదక్, చేగుంట, తూప్రాన్ మీదుగా సికింద్రాబాద్ వరకు, మెదక్ రంగంపేట మీదుగా సంగారెడ్డి వరకు, మెదక్ నుంచి కొల్చారం , నర్సాపూర్ మీదుగా ఎంజీబీఎస్ వరకు, మెదక్ డిపో బస్సులు గోపాల్‌పేట, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ మీదుగా బోధన్ వరకు బస్ సర్వీసులు కొనసాగాయి. దీంతో పాటు రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు, మెదక్ డిపో నుంచి తిరుపతి, అమలాపురం, కాకినాడ వరకు మెదక్ నుంచి సికింద్రాబాద్ వరకు నాన్‌స్టాప్ బస్సులను సైతం నడిపించడంతో ప్రయాణికుల ప్రయాణాలు సజావుగా సాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా మెదక్ పట్టణ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

కనిపించని సమ్మె ప్రభావం
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎక్కడ కూడా ప్రభావం మాత్రం కన్పించడంలేదు. వివిధ రూట్లలో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షలు

ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గుల్షన్‌క్లబ్ నుంచి ర్యాలీగా ప్రారంభై రాందాస్ చౌరస్తావద్ద గల సకల జనుల నిరాహార దీక్షలు శనివారం ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో ఆర్టీసీ కార్మికులకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...