హాయిగా ప్రయాణం..


Sat,November 2, 2019 12:20 AM

-యథావిధిగా నడిచినఆర్టీసీ సర్వీసులు
-జిల్లాలో కనిపించని సమ్మె ప్రభావం
-అందుబాటులో 142 వాహనాలు
-ఇబ్బందులు లేకుండా అధికారుల చర్యలు

యాదాద్రిభువగనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : వివిధ డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. గత 26 రోజులుగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర ్లతో యాథావిధిగా బస్సులను నడిపించారు. దీంతో ప్రయాణి కులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు సాఫీగా సా గాయి. జిల్లాలో 142 బస్సులు నడువడగా అందులో 65 ఆర్టీ సీ, 65 మంది డ్రైవర్లు, 65 మంది కండక్టర్లను, 14 అద్దెబస్సు లు, 60 మాక్సి క్యాబ్‌లు, 3 మోటారు క్యాబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు 26 రోజులుగా చేపట్టిన సమ్మె జిల్లా వ్యాప్తంగా పెద్దగా ప్రభావం చూపలేదు. సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ప్రయాణం సజావుగా సాగేలా అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. వారం రోజులుగా ఎలాం టి అంతరాయం కలుగకుండా ఆర్టీసీ తన సేవలను కొనసాగిస్తుంది. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులకు తావివ్వకుండా ఆర్టీసీ తన సేవలను కొనసాగించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 142 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. మరో పక్క కార్మికుల సమ్మె కూడా యథావిధిగా కొనసాగుతున్నది. సమ్మెలో భాగంగా కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

హాయిగా ప్రయాణం..
ఆర్టీసీ ప్రత్యామ్నామ చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులు సజావుగా వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. పండుగను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసేందుకు గానూ 142 బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 65 ఆర్టీసీ బస్సు లు, 65 మంది డ్రైవర్లు, 65 మంది కండక్టర్లను, 14 అద్దె బస్సులు, 60 మాక్సి క్యాబ్‌లు, 03 మోటారు క్యాబ్‌లను అందుబాటులో ఉంచి సేవలను అందించింది.

ప్రయాణికుల రద్దీ బట్టి చర్యలు..
ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని బస్సులను అందుబాటులో ఉంచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని యాదగిరిగుట్ట ఆర్టీసీ డీఎం రఘు తెలిపారు. అందుకు గానూ ఇప్పటికే 65 మంది తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నామని అన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో 65 బస్సులు, 65 మంది డ్రైవర్లు, 65 మంది కం డక్టర్లను అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే రోజువారి కంటే మరో నాలుగు బస్సులను అదనంగా అందుబాటులో ఉంచామని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 142 బస్సులను అందుబాటులో ఉంచామని చెప్పారు.

కొనసాగుతున్న కార్మికుల సమ్మె..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ జేఏసీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట డిపో వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు వివిధ పార్టీలు సంఘీభావం తెలిపాయి.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...