గోర్‌జీవన్ సినిమా బృందానికి ఘన సన్మానం


Sat,November 2, 2019 12:14 AM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: గోర్‌జీవన్ సినిమా బృందానికి శుక్రవారం రాత్రి బంజరా భేరి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో ఘనంగా సన్మానం చేశారు. నర్సాపూర్ పట్టణంలో గోర్‌జీవన్ చిత్ర యూనిట్ సభ్యులు హీరో కేపీఎన్ చౌ హన్, నటి వికాసినిరెడ్డి, నిర్మాత సంతోష్‌నాయు డు, సంగీత దర్శకుడు బోలేషావాలి, బాల నటుడు చక్రిలు సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీనివాస థియోటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బంజరాభేరి జిల్లా అధ్యక్షుడు ధన్‌సింగ్ నాయక్, తుల్జరాంపేట సర్పంచ్ సామ్యానాయక్‌తో పాటు గిరిజన సంఘం నాయకులు వారికి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం హీరో మాట్లాడుతూ మొదటి సారిగా బంజరాల సమస్యలు జీవన విధానంపై నిర్మించిన సినిమాకు మంచి స్పందన రావడం సంతోషకరమని అన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...