ఏడుపాయలలో భక్తుల సందడి


Sun,October 20, 2019 11:59 PM

పాపన్నపేట : పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ సిబ్బంది రవికుమార్, సూర్య శ్రీనివాస్, సిద్దిపేట శ్రీనివాస్, తదితరులు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, బోనాలను సమర్పించారు. వేద బ్రాహ్మణులు నరసింహాచారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.

చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో..
చిలిపిచెడ్ : భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను తీరుస్తున్న చాముండేశ్వరీ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులోని వెలసిన చాముండేశ్వరీ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ ప్రధాన పూజారి ప్రభాకరశర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...